
టేకులపల్లిలో బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి: కాలేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ సి.బి.ఐ కి అప్పగించటం దుర్మార్గపు చర్య అని టేకులపల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మేర్ల వరప్రసాద్ గౌడ్, బోడ బాలు నాయక్ లు విమర్శించారు, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు , నియోజకవర్గ ఇంచార్జి బానోత్ హరిప్రియ నాయక్ అదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల వ్యవహరించిన తీరును, కుట్రలను నిరసిస్తూ నేడు టేకులపల్లి మండలం లో ప్రధాన రహదారి పై రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో మండల నాయకులు బానోత్ రామా నాయుక్, జాలాది అప్పారావు, ఆమెడ రేణుక,భూక్యా బాలకృష్ణ, శివకృష్ణ, ఉద్యమ కారులు లాలునాయక్, తేజావత్ రవినాయక్, పోతుగంటి వీరభద్రం, క్ష్మీనారాయణ,మాలోత్ సురేందర్,చందర్,అల్యా నాయక్, లచ్చు,లక్పతి, జాటోత్ నరేష్, ముచ్చా జయరాజు,, హమాలి మేస్త్రి దల్సింగ్, బానోత్ బన్సీలాల్,శంకర్, చిట్టీ రాజు,రవీందర్,నర్సింహరావు,గంగాదర్ శ్రీను,జరుపుల సంతోష్, భీముడు తదితరులు మండల నాయకులు పాల్గొన్నారు