
పయనించే సూర్యుడు నవంబర్ 2( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
కె.వి పిఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి డ మాయి ప్రభాకర్ శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో 10 మంది మృతి చెందడం బాధాకరం… మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు ఉండడం విచారకరం… వారి కుటుంబాలకు సానుభూతి….ఈ ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు…. చనిపోయినవారి కుటుంబాలకు, గాయపడిన భక్తులకు నష్టపరిహారం చెల్లించాలి….శనివారం ఏకాదశి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా ముందస్తు ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకుల వైఫల్యం….ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది….ఆలయాల్లో భక్తుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి….డమాయి ప్రభాకర్ KVPS తిరుపతి జిల్లా కార్యదర్శి