
అన్నప్రసన్న మరియు సీమంతం కార్యక్రమాలు
పోషకాహారం గురించి మహిళలకు అవగాహన
( పయనించే సూర్యుడు అక్టోబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని కాశిరెడ్డిగూడ లో పోషణ్ మాసం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు .పోషకాహార ప్రాముఖ్యత, దాని ఆరోగ్యంపై ప్రభావం, పోషకాహార లోపాన్ని గుర్తించే లక్షణాలు, మరియు సమతుల్య, పోషక విలువలతో కూడిన ఆహారం ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చించడం జరిగింది. అనంతరం గర్భిణీ స్త్రీలకు (సీమంతం) మరియు 6 నెలల చిన్నపిల్లలకు అన్నప్రాసన,సీమంతం కార్యక్రమం నిర్వహించారు.గర్భిణులు, చిన్నపిల్లలు, కిశోర బాలికలుకు పోషకాహార అవగాహన కల్పించారు.అనంతరం వారు చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, పాలు వంటి పోషకాహార పదార్థాలు తీసుకోవాలని అన్నారు.పోషకాహారంపై ప్రతి ఒక్కరి పూర్తి అవగాహన అవసరం ఉండాలని తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు మరియు సీమంతం చిన్నపిల్లలకు అన్న ప్రసన్న మరి అక్షర వ్యాసం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాశిరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం,శివకుమార్, ప్రగతి వెల్ఫేర్ సొసైటీ లావణ్య, తులసి, ప్రగతి, శృతి ఏఎన్ఎం సునీత, అంగన్వాడీ టీచర్స్ రజిత, హేమలత, ఆశ వర్కర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
