
పయనించే సూర్యుడు ఏప్రిల్ 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
పవిత్ర గోదావరి నది ఒడ్డున కొలువైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించు కొని ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. గత నెల ముప్పై వ తేదీన ప్రారంభమైన శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు కొనసాగునున్నాయి.
ఈ నేపథ్యంలోతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భద్రాచలం పర్యటన ఖరారు అయింది. ఈరోజు ఉదయం భద్రాచలా నికి తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,పయ నం కానున్నారు కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య ను దర్శించుకోబోతున్నారు ఇక ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా భద్రాద్రి రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ పలువురు మంత్రులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే అధికారులు కూడా రానున్నారని తెలుస్తోంది. ఈ మేరకు.అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా చూస్తున్నారు.