
ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా శిక్షణ
సర్టిఫికెట్లను అందజేసిన ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ డ్యాగ శంకర్
( పయనించే సూర్యుడు మార్చి 30 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం జరిగింది .మహిళల స్వయం ఉపాధి కొరకై తమ కాళ్లపై తాము జీవించడానికి మంచి నిష్ణాతుల చే శిక్షణ ఇప్పించడం జరిగింది ఈరోజు సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ డ్యాగ శంకర్ మాట్లాడుతూ పౌరులకు చదువుతోపాటు మంచి నైపుణ్యం చాలా అవసరమని అలాంటి నైపుణ్యాలను అందిస్తున్న ప్రగతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అలోక్ అగర్వాల్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్న సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యా వైద్యం మహిళా సాధికారత కొరకు చాలా కార్యక్రమాలు మా సంస్థ ద్వారా నిర్వహిస్తున్నాం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు తులసి, ప్రగతి, కార్తీక్, శ్రీకాంత్, లావణ్య, శ్వేత, శృతి మహిళలు పాల్గొన్నారు