
పయనించే సూర్యుడు// న్యూస్ మే16// నారాయణపేట జిల్లా బ్యూరో // బి విశ్వ
.క్రిష్ణ మండలం కున్సీ గ్రామంలో మొన్న రాత్రి ఉరుములు మెరుపులతో పాటు గాలి బీబత్సమనికి అనేక చెట్లు కూలిపోయి, కరెంటు స్తంబాలు పడిపోయి కరెంట్ తీగలు తెగి విద్యుత్ అంతరాయము కల్గిన విషయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వామినాథ్ మరియు విద్యుత్ లైన్ మెన్ సాయి ఇద్దరు ప్రతేక చొరవతో తీసుకోని వెంటనే పై అధికారుల దగ్గర మాట్లాడి లేబర్ తీసుకు వచ్చి కూలిన చెట్లను తొలగించి అవసరమైన స్తంబాలు, వైర్ ను సమాకూర్చి విద్యుత్ ను పునరుద్దరిచారు. కావున వారి చొరవను అభినందిస్తూ ఈ ఉద్యోగ ధర్మాన్ని చిత్తశుద్ధి తో నిర్వహించిన సందర్బంగా ఇలాగే కొనసాగిoచి అందరికి మన్ననలు పొందాలని కోరుకుంటూ, విరిద్దరి అధికారులకు పూలమాల శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. కార్యక్రమం లో గ్రామ పెద్దలు బీజేపీ ఉమ్మడి మండల అధ్యక్షులు నల్లే నర్సప్ప,రాంచందర్ మాస్టర్, సిద్దప్ప మాస్టర్, రుద్రప్ప, నాగేందర్,సుదర్శన్,అన్వార్, మ్యాకలి మహాదేవ్, నల్లే శ్రీనివాస్, బనప్ప సౌకర్,శరణప్ప గౌడ్, మెంబెర్ మహాదేవప్ప, సుగురప్ప, సౌకరి,ఖందొడ్డి నారాయణ, కొండా శరణగౌడ్, జనార్దన్,మాణిక్యప్ప, సబూగౌడ్,బి నర్సప్ప తదితరులు పాల్గొన్నారు.