
ప్రెస్ మీట్ లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ఈ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసం వద్ద నిర్వహించిన ప్రెస్ మీట్ లో దేశవ్యాప్తంగా కులగణన చేస్తామనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సంతోషం వ్యక్తం చేశారు. జనగణనతోపాటు కులగణన చేయాలని నిర్ణయించినందుకు ధన్యావాదాలు తెలిపారు. రాష్ట్రం యూనిట్ గా కులగణన చేయాలని కోరారు. తెలంగాణలో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేశామని, తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 97 శాతం కులగణన పూర్తి చేశామని, మిగిలిన 3 శాతం మందికి మరో అవకాశం కూడా ఇచ్చామని చెప్పారు. మాట నిలబెట్టుకున్నాం.. సీఎం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. ప్రజలు, ప్రజా ప్రతినిథులు పాల్గొని తెలంగాణలో కులగణన విజయవంతం చేశామన్నారు. బీసీ రిజర్వేషన్ 42 శాతం ఇవ్వాలని తీర్మాణం చేశాం. ఢిల్లీ జంతర్ మంతర్ లో కులగణన కోసం ధర్నా చేశాం. ప్రధాని మోదీ తీసుకున్న జనగణనలతో కులగణను చేరుస్తామనే నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు.అయితే దీనిని ఎప్పుడు మొదలు పెడుతున్నారు. ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలన్నారు.దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,సీనియర్ నేత కేశవ రావు, బీసీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
