సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ
టేకులపల్లి లో ఘనంగా సత్యశోధక్ 135వ జయంతి వేడుకలు
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ్ ద్వారా దేశంలో కులరహిత సమాజంకై ఎన్నో పోరాటాలు వేచారని తను తన సహచరి సావిత్రిబాయి పూలే జీవితాంతం కులరహిత సమాజం కు దోపిడి సమాజానికి వ్యతిరేకంగా పోరాడారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు ఎ ఐ కె యం ఎస్ జిల్లా నాయకులు భూక్య హర్జ అన్నారు టేకులపల్లి లో సత్యశోదక్ 135వ జయంతిని పురస్కరించుకొని వారు మాట్లాడారు జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ఉద్యమించాలని వారు అన్నారు దేశంలో పాలక పార్టీలు కుల మతాలను ప్రోత్సహిస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నాయని వారు అన్నారు .దేశంలో ప్రజలు యువకులు, కార్మికులు మేధావులు పాలకవర్గాల కుల రాజకీయాలను మత రాజకీయాలను అర్థం చేసుకొని కులరహిత సమాజం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు దేశంలో దోపిడీ చేసే వర్గం, దోపిడీకి గురైయే వర్గాలు రెండే ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు గుగులోత్ రామచంద్ పి వై ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ ఐ ఎఫ్ టి యు టేకులపల్లి ఏరియా అధ్యక్షులు బోడ మంచా శంకర్ వెంకట రామ్ బోడ మంగిలాల్ ఎట్టి నరసింహారావు మేకల వినోద్ బుర్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు

