పయనించే సూర్యుడు అక్టోబర్ 30,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
- నల్ల బ్యాడ్జీలతో రెండవ రోజు నంద్యాల వాణిజ్య పన్నుల కార్యాలయంలో నిరసన చిత్తూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సబ్‌డివిజనల్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్‌రెడ్డి కుల వివక్షతో ఉద్యోగులను అవమానించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ఇచ్చిన మూడు రోజులు నిరసన కార్యక్రమాల పిలుపు మేరకు రెండవ రోజు ప్రభుత్వ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బుధవారం భోజన విరామ సమయంలో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె. నాగేంద్రప్ప, కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ – రవీంద్రనాథ్‌రెడ్డి తన వద్ద పనిచేసే సబ్‌ఆర్డినేట్లు ఏ. లవ్‌కుమార్, కే. భరత్‌లను కులం పేరుతో దూషించడం, చెప్పులు బయట పెట్టి లోపలికి రావాలని ఆదేశించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆగ్రహించారు. ఇలాంటి అవమానకర ప్రవర్తన చేసిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ – ఉన్నతాధికార హోదాలో కూర్చున్న వ్యక్తి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి కానీ ఇలా పెద్ద హోదాలో ఉండి ఉద్యోగులను కించపరచడం, కులాలను ఎత్తి చూపడం సభ్య సమాజం లో ఇటువంటివి సరియైనవి కాదని, ఇటువంటి అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం తప్ప ప్రజలకు సేవ చేయడంలో విఫలం అవుతారని, ఉన్నత హోదాలో ఉండి ఇలా కుల వివక్ష చూపించడం సిగ్గుచేటు చర్య అని, ప్రభుత్వం విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళన కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షురాలు రిజ్వానా పర్వీన్, నగర కోశాధికారి వెంకట చక్రధర్, సంయుక్త కార్యదర్శి ఆర్. ప్రభావతి, ఏపీ సిటీ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి, ఏపీ సిటీ ఎన్జిఓ అధ్యక్షుడు కమలాకర్, ఎస్సి, ఎస్టి ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు నిర్మల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామీణ నీటి పారుదల శాఖ ఉద్యోగులు బుల్లెట్ భాష, నిర్మల, సుబ్బరత్నమ్మ, సురేంద్ర, పుల్లయ్య, మోహన్, ఉదయ్, సుమన్, దీప, బల్వీర్, రాఘవేంద్ర, బాలరాజు, యశోద, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

