
పయనించే సూర్యుడు అక్టోబర్ 3 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
KVPS కులవివక్ష వ్యతిరేక పోరాటసంఘం) 28వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దొరవారి సత్రం కెవిపిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కెవిపిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ముందుగా కెవిపిఎస్ జెండా కామ్రేడ్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్షత కు వ్యతిరేకంగా కెవిపిఎస్ నిరంతరం పాటుపడుతుంది కుల నిర్మూలన జరగాలంటే మానవుల ఆలోచన విధానంలో మార్పు రావాలని అన్నారు అనంతరం జరిగిన కార్యక్రమానికి కెవిపిఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి డమాయి ప్రభాకర్ అధ్యక్షత వహించారు సభాధ్యక్షులు డమాయి ప్రభాకర్ మాట్లాడుతూ కెవిపిఎస్ ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన పునాదులుగా ఏర్పడింది ఈ దశగా సమ సమాజ స్థాపన ధ్యేయంగా కెవిపిఎస్ పనిచేస్తుందన్నారు.కామ్రేడ్ అల్లేయ్య మాట్లాడుతూ కెవిపిఎస్ తొలినాళ్లలోనే రెండు గ్లాసుల విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేసిందన్నారు. కెవిపిఎస్ జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు వెంకయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దళితులకు స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేవు అన్నారు ఇటీవల సూళ్లూరుపేట ఏరియా కమిటీ నుంచి తిరుపతి జిల్లా ఏపీ డీకేఎస్ అధ్యక్షులుగా ఎన్నికైన దూడల రఘు ని కెవిపిఎస్ ఆధ్వర్యంలో కామ్రేడ్ చంద్రశేఖర్ , కామ్రేడ్ అల్లెయ్య , కామ్రేడ్ డమాయి ప్రభాకర్ , కామ్రేడ్ వెంకయ్య ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పుల్ల నాగరాజు స్థానిక నాయకులు యాగాని సాగరయ్య , దారా కోటయ్య , జయ కృష్ణ మరియు డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు