
పయనించే సూర్యుడు మే 10: తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి నియోజకవర్గంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా దేశాలకు చెందిన వ్యక్తులు అక్రమంగా నివసిస్తూ, నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై బీజేపీ నేతలు పోలీసులకు వినతిపత్రం అందించారు. జాతీయ భద్రతకు ఈ పరిస్థితి ముప్పుగా మారుతున్నదని వారు అన్నారు. ఈ మేరకు కూకట్‌పల్లి అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు నాయకత్వంలో బీజేపీ ప్రతినిధుల బృందం కూకట్‌పల్లి సీఐను కలిసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొనీ. దేశ భద్రత కోసం ప్రతి ఒక్కరూ గళం వినిపించాల్సిన సమయం ఇదేనని “ఉగ్రవాదం మానవతకు విరుద్ధమైన నేరం. దేశ భద్రత, ప్రజల శాంతి, అభివృద్ధికి ఇది పెద్ద అడ్డంకి. మనం ఐక్యంగా నిలబడి ఉగ్రవాదాన్ని శాసించి, సమాజాన్ని శాంతియుతంగా తీర్చిదిద్దాలనీ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ రాజేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూకట్ పల్లీ అసెంబ్లీ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, జిల్లా కార్యదర్శి తూము శైలేష్ కుమార్, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి విజయ భవాని, నియోజకవర్గంలోని డివిజన్ అధ్యక్షులు, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.