Monday, August 18, 2025
Homeఆంధ్రప్రదేశ్కూకట్పల్లి గ్రామ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375...

కూకట్పల్లి గ్రామ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా కూకట్పల్లి గ్రామ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో సోమవారం ఉదయం కూకట్పల్లి లో తూర్పు కమాన్ పక్కన ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి కూకట్పల్లి గ్రామ గౌడ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ హాజరై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు, ఈ సందర్భంగా తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి దొరలకు దీటుగా కని విని ఎరుగని రీతిలో తన సామ్రాజ్యాన్ని స్థాపించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు, ఈ కార్యక్రమంలో గూడెపు నాగరాజు, దానబోయిన నర్సింహారావు, నర్సింగ్ గౌడ్, ముసలి బాలరాజు, స్వరూప గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments