Thursday, May 1, 2025
Homeఆంధ్రప్రదేశ్కూకట్పల్లి నల్ల చెరువుపట్టా భూముల్లో మట్టితొవ్వకాలను నిలిపివేయాలిహైడ్రాకు రాష్ట్ర హైకోర్టు ఆదేశం

కూకట్పల్లి నల్ల చెరువుపట్టా భూముల్లో మట్టితొవ్వకాలను నిలిపివేయాలిహైడ్రాకు రాష్ట్ర హైకోర్టు ఆదేశం

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ మే 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

కూకట్పల్లి నల్ల చెరువు ఎఫ్ టి ఎల్ ప రిధి లోని భూమిపై యాజమాన్య హక్కులు కలిగిన పట్టాదారులకు నష్టపరి హారం చెల్లించకుండా చేపడుతున్న పనులను నిలిపివేయాలని హైడ్రాకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కూకట్పల్లి గ్రామ సర్వేనెంబరు ఇరవై ఏడు నుండి ఎనబై వరకు పట్టా భూములు ఉన్నాయి. 7.38 ఎక రాలు ప్రభుత్వ భూమి కాగా మిగతాది పట్టా భూముల్లో నల్ల చెరువు ఎఫ్ టి ఎల్ విస్తరించి ఉంది. చెరువు చుట్టుపక్కల ఉన్న ఇరవై రెండు ఎకరాల పట్టాభూ మి అనాదిగా పూర్తి యాజమాన్యపు వ్యవసాయ పట్టా హక్కులతో రైతులు వ్యవసాయం, అనుబంధ పాడి, కూరగాయాలు సాగు చేసుకుంటూ భూ ములను జీవనోపాధిగా మార్చుకున్నారు. అర్బనైజేషన్లో భాగం గా కూ కట్ పల్లె ప్రాంతం కాంక్రీట్ జింగిల గామారడంతో వ్యవసాయం కను మరుగైనా పాడి కోసం గెదెలు, ఆవుల షెడ్లు, పాకలు వేసుకుని భూమిని కాపాడుకుంటు వస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల నల్ల చెరువును అభివృద్ధి చేయడానికి హైడ్రా అధికారులు శ్రీకారం చుట్టారు. ఎఫ్ టి ఎల్ పరిధిని శాస్త్రీయబద్ధంగా నిర్ధారించడంతోపాటు భూములకు చట్టబద్ధంగా నష్టపరిహారం అందించాలని పలుమార్లు హైడ్రా ధికారులను కలిసి విన్నవించారు. అయినా పట్టించుకోకుండా పట్టా భూముల్లో గత కొద్ది రోజులుగా హైడ్రా అధికారులు మట్టి తీసే పనులు చేపడుతున్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పట్టా భూములు ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్నా నష్టపరిహారం చెల్లించాల్సిందే నన్న స్పష్టమైన విధానం ఉన్న అందుకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరిస్తుండటంతో హైదరాబాదిత పట్టాదారులు రాష్ట్ర అత్యన్న త న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై పూర్తి విచారణ జరిపిన రాష్ట్ర హై కోర్టు పట్టాదారుల భూముల్లో చేపడుతున్న మట్టి తవ్వకాలను నిలిపివేయాలని, నాట్ టూ ఇంటర్ ఫియర్ అని హైడ్రాను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ను ఆదేశించినా కొనసాగుతున్న పనులు పట్టాభూముల్లో చెరువు పూడిక తీత పేరుతో హైడ్రా చేపడుతున్న తవ్వకా లను నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా అధికారులు అవేమి పట్టించుకోకుండా పోలీసుల పహార మధ్య పనులు చేస్తున్న పట్టా దారులు ఆరోపించారు. హైడ్రా అధికారులకు హై కోర్టు ఉత్తర్వుల కాపీ ని అందజేయం జరిగిందని కాని పట్టించుకోకుండా తమ భూముల్లో పనులు చేపడుతున్నారని వాపోయారు. పనులను నిలిపివేసి తమకు పరిహారం ఏ రూపంలో ఇస్తారో స్పష్టంచేసిన తరువాత అభివృద్ధి పనులు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని వారు స్పష్టం చేశారు. కోర్టు ఆదే శాలను ధిక్కరించి పనులను ఇలాగే కొనసాగిస్తే మరోసారి హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని పట్టాదారులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments