
పయనించే సూర్యుడు మార్చి 12 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు బుధవారం ఉదయం కూకట్పల్లి నియోజకవర్గం లోని జనసేన పార్టీ ఆఫీస్ కెపిహెచ్బి కాలనీ ఐదవ ఫేస్ వద్ద కూకట్ పల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జన శ్రేణులతో కలిసి జనసేన పార్టీ జెండా ఆవిష్కరించరు.ఈ సందర్భంగా ప్రేమ కుమారు జన సైనికులకు వీర మహిళలకు ప్రజలకు అందరికీ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ 14 వ తారీకున పిఠాపురం చిత్రాడ లొ జరుగుతున్న జనసేన సభా వేదికకు తెలంగాణ రాష్ట్రం కూకట్పల్లి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో బయలుదేరుతున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ,వీర మహిళలు పాల్గొన్నారు.