
ప్రశ్నించే నాయకులను కక్షపూరితంగా అరెస్ట్
పయనించే సూర్యుడు జూలై 23 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
హామిల అమలు చేయలేకే రెడ్ బుక్ రాజ్యాంగం రీకాలింగ్ చంద్రబాబు మెనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ, బిజెపి, జనసేన పార్టీల నాయకులు ప్రజలకు ఎన్నో హామిలు గుప్పించి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి రీకాలింగ్ చంద్రబాబు మెనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు.ఆత్మకూరులోని మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం రీకాలింగ్ చంద్రబాబు మెనిఫెస్టో కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారోలోకి వచ్చేందుకు వందల సంఖ్యలో హామిలిచ్చారని, బాబు షురిటి భవిష్యత్తు గ్యారెంటి అని ప్రజలకు తెలిపి బాబు షురిటి మోసం గ్యారెంటీ చేశారన్నారు.గతంలో లాగానే ప్రస్తుతం కూడా వాటిని అమలు చేయకుండా ఎప్పటి లాగా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తల్లికి వందనం పథకం నగదు అరకొరగా బ్యాంకుల్లో వేసి పూర్తి చేశామని ప్రచారం చేసుకుంటున్నట్లు విమర్శించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలిచేందుకు తెచ్చిన రైతు భరోసా పథకాన్ని ప్రతి సంవత్సరం అందచేశారని, కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంపై ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందని పేర్కొన్నారు.మన ప్రభుత్వ హయాంలో ఉన్న ఎన్నో పథకాలు ప్రస్తుతం అమలు కావడం లేదని, ప్రజలకు ఈ విషయాలన్నింటిని ప్రతి నాయకుడు, కార్యకర్త రీకాలింగ్ చంద్రబాబు మెనిఫెస్టో కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వివరించి క్యూఆర్ కోడ్ లో స్కాన్ చేయించి వారి అభిప్రాయాలను నమోదు చేయించాలని సూచించారు.జిల్లా నుంచే తిరుగుబాటు ప్రారంభమవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులపై కక్షపూరిత రాజకీయాలను అధికంగా అమలు చేస్తున్నారని, అలాంటి వాటిపై ప్రజలతో కలసి మన జిల్లా నుండే తిరుగుబాటు ప్రారంభమవుతుందని అన్నారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, రాజంపేట ఎంపీ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ మిధున్ రెడ్డి అరెస్ట్ లు కూటమి ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఇందుకోసం తాము నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నామని అన్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపిందని, ప్రతి పైసా ఖాజానాకు జమ అయిందని, ఇలాంటి పరిస్థితుల్లో అవినీతికి, స్కాం ఎక్కడా జరిగేందుకు అవకాశం లేదన్నారు. కూటమి ప్రభుత్వం పచ్చమీడియాను ఉపయోగించి ముందుగానే ఒక పథకం ప్రకారం నాయకులను టార్గెట్ చేసి వారిని అరెస్ట్ లు చేయిస్తున్నారని పేర్కొన్నారు.రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అవలంభిస్తూ కక్ష సాధింపులో భాగంగా లేని లిక్కర్ స్కాంను సృష్టించి అక్రమంగా మిధున్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలకు రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం తప్పక నేర్పిస్తారని పేర్కొన్నారు. రీకాలింగ్ చంద్రబాబు మెనిఫెస్టో పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్తామని, కూటమి ప్రభుత్వం ప్రతి హామిని అమలు చేసే విధంగా ప్రజలతో కలసి పోరాటం చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, నియోజకవర్గ మున్సిపల్ విభాగ కన్వీనర్ చెరుకూరు కామాక్షయ్యనాయుడు, పట్టణ ఉపాధ్యక్షుడు ఆండ్రా సుబ్బారెడ్డి, నాయకులు సురేంద్రరెడ్డి, నారాయణరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు, వెంగళరెడ్డి, కల్పనారెడ్డి, రహీం, కలాం, చిల్లూరు వెంకటేశ్వర్లు, ఎం జనార్థన్ రెడ్డి, బ్రహ్మనాయుడు, ఎం శ్రీనివాసులు, జమ్రు, ఖాజారసూల్, అశోక్ రెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, బాలచెన్నయ్య, కొండా చిన వెంకటేశ్వర్లు, నందవరం ప్రతాప్, సుబ్బయ్య, చైతన్య, సురేంద్ర, తోడేటి మణి, కొండయ్య, గోవర్థన్, రఫీ తదితరులు పాల్గొన్నారు.