
పయనించే సూర్యుడు న్యూస్ (అక్టోబర్.6/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టిడిపి కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డిని స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామచంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.సోమవారం నగిరిలో స్థానిక టిడిపి నాయకులు చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కలవడం జరిగింది.ఈ నేపథ్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామచంద్రయ్య టిడిపి నియోజకవర్గ ప్రోగ్రాం సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సత్యవేడు మండలంలో నెలకొన్న పలు ప్రధాన సమస్యలను శంకర్ రెడ్డి దృష్టికి తెచ్చారు.నాగలాపురం-టి పి కోట,టిపీ పాల్యం వయా వీఆర్ కండ్రిగ వరకు కొత్త రోడ్డు నిర్మాణం,దాసుకుప్పం బైపాస్ రోడ్డు,ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అవసరమైన స్థలం వంటి సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి తెలియజేశారు.