పయనించే సూర్యుడు అక్టోబర్29 అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి
మండల కేంద్రంలోని పురాతన శివాలయం ప్రహరీ గోడ అకాల వర్షాల కారణంగా కూలిపోయింది. దీంతో బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నమయ్య జిల్లా అధికారి విశ్వనాద్ సూచనల మేరకు ఆలయ కార్యనిర్వాహక అధికారి కొండారెడ్డి వర్షానికి కూలిన మరియు అక్కడక్కడా దెబ్బ తిన్న ప్రహరీ గోడను పరిశీలించారు. ఈ సందర్బంగా స్వామి వారి భక్తులు మరియు సేవకులు మాట్లాడుతూ శివాలయ ప్రహరీ గోడ కూలిపోవడంతో ఆలయ ప్రాంగణంలోకి వివిధ రకాల జంతువులు వస్తుండడంతో ఆలయ పరిసరాలు శుభ్రత కోల్పోతున్నాయని నిధులు మంజూరు చేసి ప్రహరీ గోడను తక్షణమే నిర్మించాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి కొండా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూజారి హరికృష్ణ, జర్నలిస్ట్ రెడ్డప్పనాయుడు, భవన నిర్మాణ మెస్ట్రీ శంకరయ్య,ప్రకాష్, వెంకటయ్య, కోటేశ్వరరావు, ప్రసాద్,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

