
బిఆర్‌ఎస్ రజతోత్సవ సందర్భంగా కెసిఆర్ సైకత శిల్పం
అభినంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్
పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ : బీఆర్‌ఎస్ రజతోత్సవ సందర్భంగా మాజీ ముఖ్య మంత్రి బీఆర్ఎస్ అధినేత కెసీఆర్ గారి మీద అభిమానంతో సైకత శిల్పాన్ని ఒడిశాలోని గోల్డెన్ బీచ్‌లో రూపొందించారు ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సి నాగరకుంట నవీన్ రెడ్డి. ఈ సైకత శిల్పంలో కెసీఆర్ మా కోసం నువ్వు నిలబడ్డావు నీకోసం మేము నిలబడతాం అని బీఆర్‌ఎస్ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించిన వివరాలన్నీ పొందుపరిచారు.కెసీఆర్ సైకత శిల్పాని రూపొందించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ అభినందించారు. పార్టీ ప్రస్థానాని వివరించేలా సైకత శిల్పం బాగుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు.ఒడిశాలోని పూరీ గోల్డెన్ బీచ్‌లో ప్రముఖ సైకత శిల్పుల ఆధ్వర్యంలో దీనిని రూపొందించడం జరిగిందని ఎమ్మెల్సి నవీన్ రెడ్డి వివరించారు.