
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
పద్మభూషణ్ కేంద్ర మాజీ మంత్రివర్యులు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కెపిహెచ్పి డివిజన్ రమ్య గ్రౌండ్ లోని ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ..ఈ కార్యక్రమానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు హాజరయ్యి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టాన్ని నమ్ముకుని సంకల్పమే ఆయుధంగా లక్ష్యాన్ని చేరుకోవడం చిరంజీవి ని చూసే నేర్చుకోవాలని.. ఆయన సినిమాల ద్వారా వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచడమే కాకుండా సమాజానికి తన వంతుగా నేత్రదానం, రక్తదానం వంటి చారిటబుల్ ట్రస్ట్ లు ఏర్పాటు చేసి ఎంతోమందినీ ఆదుకుని నేటి యువతకు మార్గదర్శకులుగా చిరంజీవి నిలిచారని కొనియాడారు.ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు మందలపు సాయిబాబా చౌదరి ,శ్యామల రాజు ,పాతూరి గోపి ,రాజేష్ రాయ్, భగవాన్,వలవల నాయుడు,మహిళా నాయకులు భవాని, చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
