
//పయనించే సూర్యుడు// ఆగస్టు 7//మక్తల్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలతో ఎంతగానో నిరుపేదలకు లబ్ధి చేకూరుతున్నదని, దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం చేయాలని బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కర్ని స్వామి, మాజీ ఎంపీటీసీ జి. బలరాం రెడ్డి అన్నారు. మక్తల్ మండలంలోని జక్లేర్ లో బుధవారం మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించారు. గత 11 నెలల మోదీ పాలనలో లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని వారన్నారు. ప్రజలంతా మోదీ ప్రభుత్వానికి అండగా నిలబడాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిజెపి మక్తల్ రూరల్ మండల అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, నాయకులు నరసింహులు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.