
- జీ వెంకట్రామిరెడ్డి. సిఐటియు జిల్లా అధ్య క్షులు
పయనించే సూర్యుడు// న్యూస్ //మార్చ్ 30// మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్మిక,కర్షక సామాన్య ప్రజలకు మేలు చేకూర్చే బడ్జెట్ కాదు అది కార్పొరేట్,సంపన్న వర్గాలా మేలును కోరి ప్రవేశ పెట్టి బడ్జెట్ అని CITU జిల్లా అధ్యక్షులు జీ వెంకట్రామిరెడ్డి CITU జిల్లా కార్యదర్శి బాల్ రాం విమర్శించారు శనివారం రోజు మక్తల్ నియోజక వర్గం కేంద్రం లో ఇన్‌స్పెక్షన్ బంగ్లాలో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో కార్మిక వర్గ యొక్క డిమాండ్లను పరిష్కరించకపోగా కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బడ్జెట్ ను సవరించి కార్మిక కర్షక సామాన్య ప్రజల శ్రేయస్సును కాపాడే బడ్జెట్ గా తిరిగి ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేసారు. 50 లక్షల 65 వేల 345 కోట్ల బడ్జెట్ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మడానికి సులువు చేసినది. భీమా రంగంలో 100% ఎఫ్ డీ ఐ లను అనుమతించడం బిజెపి నేతల దేశ భక్తి ఎక్కడుందన్నారు వీటితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను కేవలం కొంతమంది కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ఈ బడ్జెట్ ను తయారు చేశారన్నారు కార్మిక వర్గం యొక్క హక్కులను నాలుగు లేబర్ కోడ్స్ ద్వారా హరించే ప్రయత్నం చేస్తుంది.కార్మికుల కనీసవేతనం, పిఎఫ్ ,ఇఎస్ఐ ,ఉద్యోగ బద్రతల గురించి పట్టించుకోలేదన్నారు . దేశంలో ఉత్పత్తి రంగంలో కీలకమైన రైతులు,వ్యవసాయ కార్మికులు, సంఘటిత కార్మికులు అసంఘటితరంగ కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా ఈబడ్జెట్రూపొందించారన్నారు*
ఈ విలేకర్ల సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పుంజనూరు ఆంజనేయులు, సిఐటియు జిల్లా సహాయకార్యదర్శి లు గోవింద్‌రాజ్, జోషి తదితరులు పాల్గొన్నారు
