
పయనించే సూర్యుడు మే ఒకటి నిజామాబాద్ జిల్లా బ్యూరో టీకే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా ఆర్మూర్
టి యు సి ఐ ఆధ్వర్యంలో ఆర్మూర్ లో మే డే ర్యాలీ , బహిరంగ సభ
ముఖ్య వ్యక్తిగా హాజరు అయిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ రూలర్, కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి,ప్రభాకర్
ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ ఆధ్వర్యంలో ఆర్మూర్ లోని మేడే కార్యక్రమాన్ని నిర్వహించి బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది . తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏం ముత్తన్న మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించి సభకు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ రూలర్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్. హాజరయ్యారు వారు
మాట్లాడుతూ. పని గంటలు తగ్గించాలని ఇంగ్లాండులో కార్మిక నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఇంగ్లాండ్ ప్రభుత్వం వారిని ఉరిశిక్ష విధించింది, క్షమాభిక్ష కోరుకొండని అడిగిన వారు కోరుకోకుండా భవిష్యత్ తరాల కార్మిక సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తూ పొందిన అమరత్వాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి. చికాగోలో చిందిన రక్తం ఆ అమరవీరుల త్యాగం, వారి త్యాగాలను స్మరిస్తూ కార్మిక హక్కులను సాధించాలి.మన ప్రాంతంలో బీడీ కార్మికుల ఉద్యమానికి అనేక దశాబ్దాల చరిత్ర ఉందనీ అనేక సంవత్సరాలుగా బీడీ కార్మికుల కోసం సరైన పనికి సరైన వేతనం కోసం ,బీడీ కార్మికుల పింఛను కోసం, పెద్ద ఎత్తున పోరాటాలు చేసాము. అదేవిధంగా గ్రామపంచాయతీ కార్మికుల కోసం వారి జీవన ఉపాధి ఉద్యోగ భద్రత కోసం ఆర్మూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్మించాం .అనేక రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు వారి యొక్క సమస్యలపై వారి యొక్క హక్కులపై కార్మిక సంఘం ఎప్పుడు వెన్నంటే ఉంది. నేడు మన హక్కులను మనం కొట్లాడి తెచ్చుకున్న కార్మిక హక్కులను ,చట్టాలను, నరేంద్ర మోడీ ప్రభుత్వం ని ర్వీర్యం చేస్తా ఉంది. శ్రమతో కూడిన వేతనాన్ని ఇవ్వడం లేదు. ఎనిమిది గంటల పని దినాన్ని రూపుమాపి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తా ఉన్నారు . అంబానీ ఆదాని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు దేశాన్ని, కార్మిక చట్టాలను అప్పజెపుతున్నారు. ఇది నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరికి నిదర్శనం . మోడీ కార్మిక వ్యతిరేకి అనే దానికి ఉదాహరణ .ప్రశ్నిస్తే ,మా హక్కులు మాకు కావాలి అంటే దేవుడి పేరుతో, మతం పేరుతో, రాజకీయాలు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశాన్ని ఒక చీకటి యుగం వైపు తీసుకెళ్తున్నారు.
కావున మనం మళ్లీ పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. మీ హక్కుల కోసం మీ సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ మీ వెంట ఉంటుందని వారు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాజేశ్వర్ సత్తెక్క , డివిజన్ నాయకులు, అరవింద్, తూర్పాటి శ్రీనివాస్, నజీర్ పద్మ లక్ష్మి సునీత మరియు కార్మికులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
