
పయనించే సూర్యుడు. ఏప్రిల్ 15. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
నేడు ఏన్కూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కేటీఆర్ యువసేన ఏన్కూర్ మండల కమిటీ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డా. బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు, అనంతరం స్వీట్స్ పంచిపెట్టి ఆ ఆదర్శ మూర్తిని స్మరించుకున్నారు. అంబేద్కర్ గారి జీవితమే మన అందరికి ఆదర్శమని, ఆయన చూపించిన దారిలోనే మనమందరం నడవాలని అదే ఆయనకి మనం అందించే అసలైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భుక్యా వినోద్ కుమార్, భుక్యా ధర్మా నాయక్, యూత్ నాయకులు షైక్ బాజీ, బానోత్ వినోద్, కాకటి దావీదు తదితరులు పాల్గొన్నారు.