
బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు
పయనించే సూర్యడు // మార్చ్ // 24 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి లేదు అని కేటీఆర్ అనడం అతని రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు అన్నారు. నిన్న కరీంనగర్ లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడిన మాటలను చూసి ప్రజలను నవ్వుకుంటున్నారని సంపత్ రావు తెలిపారు.2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ 8 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుందని, కానీ బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదని, అనేక సీట్లలో డిపాజిట్ కూడా రాలేదనే విషయం కేటీఆర్ మర్చిపోయినట్టున్నాడని సంపత్ రావు చురకంటించ్చాడు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి పోటీ చేసే అభ్యర్థులు లేక ఎన్నికల నుండి తప్పుకున్నదని ఘాటుగా విమర్శించారు. అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పట్టభద్రులు, టీచర్స్ స్థానాలను రెండింటినీ గెలవడం జరిగిందని, ఈ విషయాన్ని మర్చిపోయి కేటీఆర్ మాట్లాడడం దుర్మార్గం అని మండిపడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ఉనికి కోల్పోతుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బిఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి కనబడుతుందని, అదే డిప్రెషన్లో కేటీఆర్ మాట్లాడుతున్నాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని సంపత్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.