
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
జర్నలిస్టుల శ్రేయస్సు కోసం కృషి చేయాలని సూచన..
“జర్నలిస్టు కేపీ”నీ శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే..
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
జర్నలిస్టుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ జర్నలిస్టు కేపీని కోరారు. షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ ఎండి ఖాజాపాషా (కేపీ) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కౌన్సిల్ కు ఎన్నికైన నేపథ్యంలో సోమవారం స్థానిక ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఆయనను అభినందించి శాలువా కప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టు నాయకుడిగా ఇంతింతై ఎదుగుతూ, మరోవైపు సామాజిక సేవలో కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతూ కెపి సర్వత్తా ప్రశంసలు పొందుతున్నారని అభినందించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. జర్నలిస్టులకు నిరంతరం అండగా ఉండాలని అన్నారు. తాను కూడా జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. గిరిజన ఆదివాసి కోఆర్డినేటర్ పి. రఘు, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, నందిగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా నరసింహా యాదవ్, వెల్జర్ల సీనియర్ నాయకులు వాడియాల నరసింహారెడ్డి, పట్టణ సీనియర్ నాయకులు అగ్గనూరు బస్వం, మైనార్టీ నాయకులు జమ్రుద్ ఖాన్, దళిత సంఘం నాయకులు జంగారి రవి, యువ నాయకులు జెట్టా మహేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
