
ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
ఎల్లారెడ్డి గూడలో మాగంటి సునీతమ్మ ఎన్నికల ప్రచారం
పాల్గొన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితాఇంద్రా రెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు అక్టోబర్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతమ్మను కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి గెల్పిస్తామని ప్రజలే స్వచ్చందంగా చెప్తున్నారని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డిగూడలో మాగంటి సునీతమ్మ ఇంట్టింటి ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ ప్రచారంలో మాజీ కార్పోరేటర్ మహేష్ యాదవ్, భూత్ ఇన్చార్జులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
