
పయనించే సూర్యుడు; జులై 05: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోనీ, కొంగాల గ్రామపంచాయితీ లోని కాంగాల గ్రామంలో శనివారం ఇంటింట ఆరోగ్య సర్వే నిర్వర్తించడం జరిగింది. ఈయొక్క సర్వేలో భాగంగా గ్రామాలలో జ్వరాలు ఉన్నందున ఫీల్డ్ స్టాప్ సిబ్బంది వైద్య అధికారి కి సమాచారం అందించారు. సిబ్బంది చేసే సర్వే క్షుణ్ణంగా పరీక్షించి వారితోపాటు సబ్ యూనిటీ అధికారిని కొంగాల గ్రామం తీసుకొచ్చి జ్వరంతో ఉన్న వారి ఇళ్లను పరిశీలించి, పరిశుభ్రం గా ఉండాలనిచెబుతూ,చెట్టు తొర్రలో ఉన్న ఉన్న లార్వాలో తిమోపాస్ మందు చల్లటం జరిగిందనీ తెలియజేశారు. అనంతరం వైద్య శిబిరం నిర్వహించి జ్వరంతో ఉన్న ఇద్దరినీవైద్యశాలకు పంపించడం జరిగిందనీ, శిబిరంలో పరీక్షించుకున్న వారు 32మంది కాగా పూత సేకరణ నాలుగు ఆర్డిటి నిర్ధారణ పరీక్షలు ఆరుగురు గర్భవతులు మూడు బాలింత ఒక్కరు ఆ సంక్రమిత మధుమేహం అని తెలిపారు. అనంతరం రక్తపోటు ఉన్న వారికి నెలసరి మందులు అందజేయాలని వైద్య సిబ్బందికి ఆదేశించడం జరిగిందనీ తెలియజేశారు. ఈయొక్క కార్యక్రమంలో వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ కొమరం మహేందర్ సబ్ యూనిటీ అధికారి వాసం నరసింహారావు మరియు వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొనడం జరిగిందనీ తెలియజేశారు.
