
ఐటీడీఏ పీవో బి రాహుల్
పయనించే సూర్యుడు మే 23 (పొనకంటి ఉపేందర్ రావు )
ఐటీడీఏ పరిధిలో మారుమూల దట్టమైన అటవీ నెరవేర్చటానికి పీఎం జన్మన్ పథకం పథకంప్రాంతంలో నివసిస్తున్న కొండరెడ్ల గిరిజనుల కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడానికి పీఎం జన్మన్ పథకం కింద ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడానికి సంబంధిత ఎంపీడీవోలు ప్రతిపాదనలు తయారుచేసి సమర్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.శుక్రవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో దమ్మపేట అశ్వరావుపేట మండలాలలోని ఎంపీడీవోలు మరియు కొండరెడ్ల గ్రామాలకు సంబంధించిన పంచాయతీ సెక్రెటరీలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు ఇస్తూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ కొండ కోనల్లో నివసించే కొండ రెడ్ల గిరిజన కుటుంబాలకు పీఎం జన్మన్ పథకం ద్వారా నివాస గృహాలు నిర్మాణం చేపట్టడానికి ప్రతిపాదనలు కోరినందున సంబంధిత ఎంపీడీవోలు మరియు పంచాయతీ సెక్రటరీలు అశ్వరావుపేట మండలంలో ఏడు కొండ రెడ్ల గిరిజన గ్రామాల హేబిటేషన్లు మరియు దమ్మపేట మండలంలో పూసుకుంట గ్రామంలోని కొండరెడ్ల గిరిజన కుటుంబాలను ఇంటింటికి తిరిగి మొబైల్ యాప్ ద్వారా సర్వే చేసి వాటికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరితగతిన సమర్పించాలని, కొండ రెడ్ల గిరిజన కుటుంబాలలోని అర్హులైన ప్రతి ఒక్కరిని మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ చేసి అందరికీ పిఎం జన్మన్ పథకం ద్వారా నివాస గృహాలు అందే విధంగా సంబంధిత ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని, శనివారం నుండి మొబైల్ యాప్ ద్వారా సర్వే కార్యక్రమం ప్రారంభించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, అశ్వరావుపేట మరియు దమ్మపేట ఎంపీడీవోలు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. –