
పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 (పొనకంటి ఉపేందర్ రావు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఐటీడీఏ కార్యాలయంలోని కొండరెడ్ల విభాగంలో కొండరెడ్ల అధికారిగా (PVTG) చందా నరేష్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన దమ్మపేట మండలం తాసిల్దారుగా పని చేస్తున్న ఆయనను భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో కొండరెడ్ల విభాగం ఖాళీగా ఉన్న పోస్టులో కొండరెడ్ల గిరిజనుల సంక్షేమ అధికారిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినందున ఐటీడీఏ కొండ రెడ్ల విభాగం అధికారిగా బాధ్యతలు తీసుకున్నానని, మారుమూల ప్రాంతాలలో నివసించే కొండ రెడ్ల గిరిజనుల కుటుంబాలకు నా వంతు సహకారం అందించి వారి అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.