
విద్యార్థులకు ట్రై పాడ్స్, కంబాక్స్ లు పంపిణీ
పయనించే సూర్యుడు ఏప్రిల్ 04( గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) గోరంట్ల మండల పరిధిలోని కొండాపురం పాఠశాలలో గురువారం సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. ముందుగా సరస్వతి చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులుకి సరస్వతి మాత విద్యా బుద్ధులు ప్రసాదించాలని కోరుకున్నామన్నరు. అనంతరం అదే గ్రామానికి చెందిన భుజంగరావు విద్యార్థులకు అట్టలు, కంబాక్షులు పంపిణీ చేశారు. భుజంగరావు స్వామిని ఉపాధ్యాయులు అభినందించారు. సరస్వతి పూజా కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాణి, ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, రామచంద్ర, శ్రీనివాసమూర్తి, గీత, శ్రీకళ, తదితరులు పాల్గొన్నారు.