పయనించే సూర్యుడు బాపట్ల జనవరి13:*- రిపోర్టర్ (కే శివ కృష్ణ)
యువత మానసిక శారీరికంగా ఉండటానికి క్రీడలు ఏంటో ఉపయోగపడతాయని బాపట్ల నియోజకవర్గ సమన్వయ కర్త శివన్నారాయణ అన్నారు ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖా నెహ్రూ యువ కేంద్ర గుంటూరు సౌజన్యముతో సీసా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ అద్వర్యంలో బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు కొండుభొట్లు వారిపాలెం జెడ్పి హైస్కూల్ క్రీడా ప్రాంగణం లో శనివారం వాలీ బాల్, కబడ్డీ, పరుగు పందెం, బాడ్మింటన్ అంశాలలో నిర్వహించారు. ఆగస్టు-29, 2019 లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని యువత ఆరోగ్యపరమైన మరియు కండరపుష్టిని కలిగి ఉండాలని శారీరక శ్రమ క్రీడలు ఆడడం ద్వారా ఆరోగ్యం కల్పించుకోవాలని ఫిట్ ఇండియా మూమెంట్ను తీసుకురావడం జరిగింది. ఈ ఫిట్ ఇండియా మూవ్మెంట్ ను పురస్కరించుకుని “స్వస్థ రాష్ట్ర – సమర్థ్ రాష్ట్ర” అనే థీమ్ తొ జరిగిన బాపట్ల నియోజకవర్గ సమన్వయ కర్త శివన్నారాయణ,
కాసాని బులయ్య, కునాపరెడ్డి శ్రీనివాస్ రావు చివ్వకుల సంభయా,ఉలిచి ఎంకయ్య నాయుడు,పోటీలు ప్రారంభించారు.ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ యువత మానసిక మరియు శారీరక ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఆటలపై కొంత సమయం కేటాయించాలన్నారు. యువత పోటాపోటీగా తలబడ్డారు. విజేతలకు మెడల్స్ మరియు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీసా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు & సీఈఓ శ్రవణ్ కుమార్ మరియు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు