
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష పీఎంశ్రీ జెండర్ ఏక్విటీ సేఫ్ డిఫెన్సె ప్రోగ్రాము
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
రంగారెడ్డి జిల్లా కొందుర్గు హై స్కూల్లో బాలికలకు కరాటే శిక్షణ తరగతులను స్కూల్ హెడ్మాస్టర్ గోపీనాథ్ ప్రారంభించారు. అనంతరం స్కూల్ హెడ్మాస్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ…. ఈరోజుల్లో అమ్మాయిలపై జరుగుతున్నటువంటి అగైత్యాలను గుర్తుపెట్టుకుని బాలికలకు మార్షల్ ఆర్ట్స్ లాంటి యుద్ధ కలలు నేర్పించడం చాలా అవసరము అని అంటూ ఈ యొక్క కరాటే నేర్పడం వలన అమ్మాయిలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తుంది. అలాగే దృఢంగా ఉంటారు చదువుపై చక్కటి శ్రద్ధతో చదువుకుంటారని అలాగే ఆర్ఎస్ కరాటే మాస్టర్ మా అమ్మాయిలకు చక్కగా నేర్పి అన్ని విషయాలలో ముందుకు తీసుకెళ్లాలని హెడ్మాస్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండి నాజర్ ఆలీ,ఇంచార్జ్ వీరేశం మరియు ఫిజికల్ డైరెక్టర్ బాలాజీ కరాటే మాస్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
