
పాల్గొన్న కొందుర్గ్ మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 3 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రం లోని ఉమా మహేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద కాలనీ వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి హోమంలో కొందుర్గు మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ పాల్గొన్నారు.స్థానిక పూజారి భరత్ పంతులు ఆధ్వర్యంలో ఈ రోజు గణపతి హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజేష్ పటేల్, రామకృష్ణ, సున్నాల శ్రీనివాస్, దర్గా రాంచంద్రయ్య, కృష్ణ, ప్రభాకర్, లింగం, సచిన్, చెన్నయ్య, శ్రీశైలం, ప్రేమ్,శేఖర్, ప్రశాంత్ రెడ్డి,కమిటీ సభ్యులు: శ్రీకాంత్,తేజ, సాయి,రఘు, నరేష్, వినోద్, విష్ణు, వంశి, శేఖర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
