
మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుదాం
కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్
కొందుర్గ్ మండల, గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్
( పయనించే సూర్యుడు ఆగస్టు 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఈరోజు కొందుర్గ్ మండల కేంద్రంలో జిఎం పటేల్ ఫిల్లింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ మాట్లాడుతూ మట్టి గణేషుడిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుదాం.పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి గణపతులను పూజిద్దాం భావితరాల భవిష్యత్తుకు బాటలు వేద్దాం అన్ని అన్నారు. ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని గణేషుడిని ప్రార్థించారు.ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ షాద్ నగర్ నియోజకవర్గ,కొందుర్గ్ మండల మరియు గ్రామ ప్రజలందరి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరేష్,గుడిసె సచిన్, పొమల సంజీవ,హేమంత్, బద్రి,నవీన్, మహేశ్, అశోక్, కిట్టు జోష్, సుదర్శన్, ప్రణీత్, లడ్డు, చింటూ, ప్రశాంత్, ఇమ్మనేలు, పండు, బన్నీ తదితరులు పాల్గొన్నారు.
