
పయనించే సూర్యుడు జనవరి 21 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేర్ వనపర్తి జిల్లా,
పెబ్బేరు వనపర్తి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా నూతన అధ్యక్షులు ఇటుకూరు బిచ్చయ్య శెట్టి, జిల్లా కోశాధికారి బుస్స రమేష్ లను మంగళవారం కొత్తకోట ఆర్యవైశ్య సంఘం పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో ఘనంగా సన్మానించారు. కొత్తకోట మాజీ ఎంపీపీ జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళ అధ్యక్షురాలు గుంత మౌనిక ఆధ్వర్యంలో దాదాపు 30 మంది మహిళలు వీరిని కాలువలతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుచ్చయ్య శెట్టి, రమేష్ లు మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. జిల్లాలో పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఉచితంగా వసతి కల్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని దీనికి జిల్లాలోని ఆర్యవైశ్యులందరూ ముఖ్యంగా మహిళలు సహకరించాలని కోరారు. వసతి గృహాల ఏర్పాటుకు వైశ్యులు ఆర్థికంగా సహకరించాలని కోరారు త్వరలోనే జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటించి సంఘంలో చురుకైన పాత్ర పోశించేవారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి సంఘంలో పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు. సంఘంలో గ్రూపులు విడనాడి అందరూ ఏకతాటిపై రావాలని విజ్ఞప్తి చేశారు. పూర్తిస్థాయి కమిటీతో వచ్చే నెలలో ప్రమాణ స్వీకారం ఉంటుందని వారు తెలిపారు. సంఘంలో ఆర్య వైశ్య మహిళలు కూడా ముందుండి కార్యక్రమాలు నడిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు, స్థానికులు ప్రసన్నలక్ష్మి, స్నేహ, రాధిక, స్వప్న, శ్రీలత, కవిత, సంధ్య,లక్ష్మి, జ్యోతి, శంకర్, విజయ్ కుమార్, అశోక్, సింగయ్య తదితరులు పాల్గొన్నారు.