- విగ్రహ ప్రతిష్టాపన తరువాత మండల పూజా కార్యక్రమం
- వరుని తరపు పెద్దలుగా గోపాల్ రెడ్డి దంపతులు వధువు తరపు
- దంపతులుగా బీరంగూడ జగన్మోహన్ రెడ్డి దంపతులు వధువు
- తరపు మేనమామగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి
- శాస్త్రోక్తంగా పూజలు, కళ్యాణ మహోత్సవము జరిపించిన బ్రాహ్మణోత్తమ పురోహితుడు రాజు శర్మ
- కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తీగాపూర్ గ్రామ ప్రజలు
- పూజా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొన్న తీగాపూర్ గ్రామ మహిళలు
( పయనించే సూర్యుడు జనవరి 21 కొత్తూరు రిపోర్టర్ పిరు నాయక్ ) భక్తి వలన శక్తి వస్తుంది, శక్తి వలన ముక్తి లభిస్తుంది, భక్తి శక్తి ముక్తి మూడు లభించాలంటే భగవంతుని ఆరాధించడమే ముఖ్యమైన తత్వమని, భగవంతుని ఆరాధన కొరకై నూతన దేవాలయాల ఏర్పాటు, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఎంతో ఉపకరిస్తాయని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. తీగాపూర్ గ్రామంలో 41 రోజుల క్రితం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా సీతారామ సహిత లక్ష్మణ ఆంజనేయ స్వామి భగవత్ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అనంతరము 41 రోజులపాటు విశేష పూజలు జరిగిన తర్వాత ఈరోజు మండల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మండల పూజా కార్యక్రమాల్లో భాగంగా బ్రాహ్మణ పురోహితుడు రాజు శర్మ ఆధ్వర్యంలో నవగ్రహ మండపరాధన, సర్వతో మండలం పూజా కార్యక్రమాలు, ప్రత్యేక హోమాలు, సీనియర్ న్యాయవాది బీరంగూడ జగన్మోహన్ రెడ్డి సీతమ్మ తరఫున పెద్దలుగా వ్యవహరించగా, గోపాల్ రెడ్డి దంపతులు వరుని తరపు పెద్దలుగా ఉండి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో సీతమ్మ తరపున మేనమామగా నాగర్ కుంట నవీన్ రెడ్డి దంపతులు వ్యవహరించి సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. వేద మంత్ర చరణాల మధ్య జరిగిన కళ్యాణ మహోత్సవంలో తీగాపూర్ గ్రామస్తులు, మహిళలందరూ పాల్గొని శ్రీరామ జయజయ ద్వానాల మధ్య న భూతో న భవిష్యత్తు అనే విధంగా గ్రామస్తులందరూ కలకాలం గుర్తుంచుకునే విధంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ న్యాయవాది బీరంగూడ జగన్మోహన్ రెడ్డి దంపతులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండల పూజ మరియు కళ్యాణోత్సవ కార్యక్రమం లో తీగపూర్ మాజీ యంపిటిసి షాద్ నగర్ బార్ అసోసియేషన్ మాజీ చైర్మన్ బీరం గూడ జగన్ మోహన్ రెడ్డి, కొత్తూరు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెండే క్రిష్ణ, గోపాల్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఉప సర్పంచ్ వేణుకుమార్ రెడ్డి, ప్రభు లింగం, మల్కాపూరం చంద్రశేఖర్, అంజి రెడ్డి, శేఖర్, సాయిలు, మాజీ వార్డ్ సభ్యులు, గ్రామస్థులు బిఆర్ఎస్ యువనాయకులు కాడాలా శ్రీశైలం, దినేష్ సాగర్, శివాచారి, తదితరులు పాల్గొన్నారు.