
పయనించే సూర్యుడు అక్టోబర్ 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
బ్రహ్మముహూర్తంలో స్వామివారికి మహా రుద్రాభిషేకం మరియు అఖండ దీపారాధన కార్యక్రమమ్ లో ఆలయ ఈవో యం.రామక్రిష్ణ.పాణ్యం మండలంలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ ఈవో యం.రామక్రిష్ణ ఆధ్వర్యంలో బుధవారం రోజున కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల సురేష్ శర్మ, కంపమల్ల నారాయణ శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి గందం అభిషేక పూజలు, మహా రుద్రాభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారి గుడిలో అఖండ దీపారాధన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి కాయకర్పూరం సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తాదులందరూ విశేషంగా స్వామి వారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ శర్మ మాట్లాడుతూ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ కార్తీక మాసంలో భక్తులంతా శివనామస్మరణలో మునిగితేలుతారు. మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనదని స్కంద పురాణంలో పేర్కొన్నారు. పురాణాల కాలం నుంచి కార్తీక మాసం ఒక విశిష్టతను సంతరించుకుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ మాసమంతా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు ఇలా భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది. న కార్తీక నమో మాసఃన దేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్”అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు అని అర్ధం.” ఈ కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల భక్తులకు ఆ సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సకల సౌఖ్యాలు కలిగిస్తాడని విశ్వసిస్తారు.
