
పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి స్థానిక సంఘ నేతలతో పాటు జిల్లా అధ్యక్షులు పులిగుండ్ల. శ్రీరాములు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని ధాన్యం కొనుగోలు కేంద్రాల పేరిట రైతులను మోసం చేస్తూ అధికారులే ధాన్యం కొనుగోలు చేసిన వ్యవహారం లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీరాములు తో పాటు జిల్లా కౌలు రైతుల సంఘం నాయకులు లక్ష్మీపతి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లక్కు కృష్ణ ప్రసాద్, అనంతసాగరం రైతు సంఘం కార్యదర్శి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగిందని వీరు ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టినట్లు చెబుతూ ఉన్న రైతులకు కల్పించవలసిన మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఆశించిన స్థాయిలో రైతులు ధాన్యం అమ్ముకోలేక పోయారు. ప్రభుత్వం మాటలలో తప్ప చేతలలో ఆచరణ లేకపోవడం వల్ల ధాన్యపు పండించిన రైతులు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ధాన్య బస్తాలు అందించలేక, తేమశాతం గుర్తింపులో తేడా కారణంగా, ధాన్యం తరలించేందుకు వాహనాలు అందించలేక పోవడంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇచ్చే వసతి లేక తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సినపరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నిన్నటితో రబి ధాన్యం కొనుగోలు పూర్తి అయిన మిగిలిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పడం సంతోషకరమైన విషయమైనా తప్పనిసరిగా ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని మీరు డిమాండ్ చేశారు. ఆత్మకూరు పరిధిలో ధాన్యం కొనుగోలు విషయంలో భారీ కుంభకోణం చోటుచేసుకుని కోట్లాది రూపాయలు రైతులు నష్టపవలసి వచ్చిందని దీనిపై సమగ్ర విచారణ చేయాలని కోరారు.