Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్కొనో కార్పస్ మొక్కలు చాలా ప్రమాదకరం వాటిని తొలగించండి కలెక్టర్ సాబ్

కొనో కార్పస్ మొక్కలు చాలా ప్రమాదకరం వాటిని తొలగించండి కలెక్టర్ సాబ్

Listen to this article

పయనించే సూర్యుడు. ఏప్రిల్ 13. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్

  • ఖమ్మం జిల్లా ప్రజల తరఫున సమాచార హక్కు చట్టం 2005

  • ఆక్టి విస్ట్ సొసైటీ ఫౌండర్ మరియు రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్

  • కోనో కార్పస్ మొక్కలను వెంటనే తొలగించాలి అని డిమాండ్ చేయడం జరిగింది
  • ప్రభుత్వ యంత్రాంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూనే ఉంది
  • ప్రజా దనంతో చేసే ఏ పనైనా పది కాలాలపాటు పదిమందికి ఉపయోగపడేలా ఉండాలి కానీ వారి ప్రాణాలకు నష్టం కలిగించేలా ఉండకూడదు
  • కొనో కార్పస్ (తెలంగాణ ట్రీ) మొక్కల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉంది
  • ప్రజలు శ్వాసకోశ వ్యాధులకు గురై అవకాశం ఉంది
  • గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు నిత్యము ఉద్యోగరీత్యా కోనో కార్పస్ మొక్కలను చూస్తూ వెళుతున్నారు కానీ వాటిని
  • తొలగించడం లేదు
  • అట్టి మొక్కలను తెచ్చి ప్రజల ప్రాణాలకు నష్టం కలిగించడమే కాకుండా ప్రజాధనాన్ని కూడా వృధా చేస్తున్న పాలకులు మరియు ప్రభుత్వం యంత్రాంగ అధికారులు

ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, గత మున్సిపల్ పాలకవర్గం ప్రధాన రహదారుల్లో నిర్మించిన డివైడర్లతో పాటు, పలు 10 శాతం మున్సిపల్ స్థలాల్లో, పట్టణ ప్రకృతి వనాల్లో విచ్చలవిడిగా కొనో కార్పస్ (తెలంగాణ ట్రీ) మొక్కలను విరివిగా నాటి పెంపకాలు చేపట్టింది. పట్టణ కేంద్రంలో పల్లె ప్రకృతి వనంలో గ్రామాల్లో రోడ్డుకు విరువైపులా ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో విరివిగా నాటిన కోనో కార్పస్ మొక్కలను తొలగించండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ ఖమ్మం జిల్లా అన్ని మండలాలకు సంబంధించిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ మొక్కల విషయంలో జోక్యం చేసుకొని అట్టి మొక్కలను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ పట్టణ కేంద్రం పల్లె ప్రకృతి వనం తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 200 కోట్ల కోనో కార్పస్ మొక్కలను నాటించి పెంపకాలు చేయించింది. మొక్కలు నాటడం ప్రకృతి ఆహ్లాదం కోసం పచ్చదనాలను పెంచడం అంతా బాగుంది. అతి తక్కువ సమయంలో వేపుగా పెరుగుతుందన్న ఆలోచనతో ఈ మొక్కలను నాటడం మంచి నిర్ణయమే. కానీ ఈ కోనో కార్పస్ మొక్కల వల్ల ఈ మొక్కల వేరు పటిష్టంగా ఉండి సుమారు 200, 300 ఫీట్ల లోతుకు వెళ్లడం వల్ల ఆ మొక్కలు నాటిన ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. ప్రజలకు ఆహ్లాదం పంచడంతో పాటు పచ్చదనాన్ని అందించడం కోసం పెట్టిన ఈ కోనో కార్పస్ మొక్కలు మంచి చేయడం అటు ఉంచితే ఈ మొక్కల ద్వారా ప్రజలకు భవిష్యత్ తరాల ప్రజలకు ఇబ్బందులు అయ్యే సూచనలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ మొక్కల వేర్ల పటిష్టం వల్ల మొక్కలు నాటిన ఏరియాల్లో ఈ మొక్కల వేర్లు బాగా లోతుకు వెళ్లడం వల్ల అక్కడి భూగర్భ జలాలు అడుగంటి ఉన్నాయన్నట్టు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్న విషయం తెలిసింది. దీంతో పాటు ఈ మొక్కల నుంచి వెలువడే ఉప్పొడి కాయల వల్ల సమాజంలోని ప్రజలు శ్వాసకోశ వ్యాధులకు గురై ఇబ్బందులు పడే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రజలకు పచ్చదనాలను స్వచ్ఛందనాలను పంచడం అటుంచితే ఈ మొక్కల వల్ల కీడే ఎక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం అధికారులు ఆలోచించి ఈ మొక్కలను తీయాల్సిన అవసరం ప్రజల బాగోగులు భవిష్యత్ తరాల అవసరాలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో పల్లె ప్రకృతి వనం రోడ్డుకి ఇరువైపులా ప్రధాన రహదారుల్లో ఈ మొక్కలను నాటడం జరిగింది తదితర ప్రధాన రహదారుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ, గత మున్సిపల్ పాలకవర్గ హయాంలో నిర్మించిన డివైడర్లలో కోనో కార్పస్ మొక్కలను నాటి పెంపకాలు చేపట్టారు. ప్రధాన రహదారుల్లోని డివైడర్లతో పాటు పలు 10 శాతం పార్కు స్థలాల్లో సైతం, జాతీయ రహదారి ప్రక్కన నిర్మించిన పట్టణ ప్రకృతి వనంలో సైతం కోనో కార్పస్ మొక్కలను నాటించి పెంపకాలు చేపట్టారు. 10 శాతం స్థలాల్లో పట్టణ ప్రకృతి వనంలో పెంచిన కోనో కార్పస్ మొక్కల వల్ల ఆ ఏరియాలోని భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉందని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు ఈ కొనోకార్పస్ మొక్కల వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తొలగించి ప్రజల ఇబ్బందులు తొలగించేలా, భవిష్యత్ తరాల ప్రజల ఆవశ్యకతను గుర్తించి ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్న మాటలు ఇలా ఉన్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో హరితహారం పథకంలో సుమారు 200 కోట్ల కోనో కార్పస్ మొక్కలను పెంపకాలకు చేపట్టింది. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కోనో కార్పస్ మొక్కల పై గత అసెంబ్లీ సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు అంశంగా మారాయి. ఈ నిషేధిత కోనో కార్పస్ మొక్క నీళ్లు లేకుండా ఎక్కడంటే అక్కడే ఇస్టారీతిగా పెరుగుతుంది. ఈ మొక్క పై కనీసం పిట్ట కూడా కూసోదు. ఈ మొక్క ఆక్సిజన్ తీసుకుంటుంది కార్బన్ డయాక్సైడ్ ను వదులుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా నాటి పెంపకాలు చేపట్టిన ఈ కోనో కార్పస్ మొక్కలను ప్రజల బాగు కోసం తొలగించాలని గత అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటివరకు అట్టి మొక్కలను తొలగించినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు ఎక్కడపడితే అక్కడ ఈ మొక్కలు కనబడుతూనే ఉన్నాయి కోనో కార్పస్ మొక్కల వల్ల ప్రమాదం ఉన్నది వాస్తవమే గత బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టిన కోనో కార్పస్ మొక్కలు సైతం పెట్టి పెంపకాలు చేపట్టారు. ఈ మొక్కల వల్ల ప్రమాదం ఉన్న మాట వాస్తవమే. అది గుర్తించి ఖమ్మం జిల్లా అన్ని మండలాల పరిధిలో నాటిన మొక్కల ను తొలగించండి . డివైడర్లు నాటిన కోనో కార్పస్ మొక్కలను తొలగిస్తే గత కొన్ని సంవత్సరాల క్రితమే నిర్మించిన డివైడర్లు పూర్తిగా చెడిపోతాయి. ఆ చెట్ల వల్ల ప్రమాదం ఉన్న మాట వాస్తవమే. ఈ ఈ విషయం ప్రభుత్వ నిర్ణయం మేరకు కోనో కార్పస్ మొక్కల పాఠశాలల ఏరియాల్లో, రహదారి ప్రక్కన గల పట్టణ ప్రకృతి వనంలో నాటిన కోనో కార్పస్ మొక్కలను ఉన్నతాధికారులు వెంటనే వాటిని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments