
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 22
అల్లూరి సీతారామరాజు జిల్లా బుధవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామం నందు ఆదివాసి పోరాట అమరవీరుడు కొమరం భీమ్ 124వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ భూమి నీరు అడివి అందులోని సంపద పూర్తిగా ఆదివాసీలే అనుభవించాలని అవన్నీ కూడా ఆదివాసుల హక్కు అని నిజం నవాబు గుండెల్లో రైలు పరిగెత్తించిన మహావీరుడు కొమరం భీమ్, జమీందారులకు పెత్తందారులకు వ్యతిరేకంగా ఉద్యమించడం జరిగింది. జల్ జంగిల్ జమీన్ నినాదంతో కొమరం భీమ్ అలుపెరగని పోరాటం చేసి ఉన్నాడని వారి పోరాట స్ఫూర్తిని ఆశయ సాధనని కొనసాగించడం కోసం, భవిష్యత్ తరాలు మనగడం కోసం, ప్రస్తుత ఆదివాసి తరాలు ఉద్యమించవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు. కొమరం భీం లాంటి స్వతంత్ర సమరయోధులు వల్లనే భారత రాజ్యాంగంలో జైపాల్ సింగ్ ముండా చొరవతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆదివాసులకు ప్రత్యేక హక్కులు కల్పించి వాటి రక్షణకు చట్టాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన ఆదివాసి అమరవీరుల పోరాట ఫలితంగా ఆదివాసులకు దక్కిన రాజ్యాంగ పలాలు అందరిని ద్రాక్షగాని మిగులుతున్నాయని దీనికి కారణం పాలకులు ప్రభుత్వ అధికారులని ఆయన విమర్శించారు. ఆదివాసీల చట్టాలు అమలు కోసం హక్కులు కల్పించడం కోసం, విద్య ఉద్యోగ ఉపాధి ఫలాలు ఇవ్వడం కోసం, రక్షణ భద్రత కోసం, ఆదివాసీల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలు (ఐటిడిఏ ) ఆదివాసులకు ఉపయోగపడకుండా నాన్ ట్రైబల్స్ అభివృద్ధి సంస్థలుగా మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఆదివాసీల అమరవీరుల పోరాట ఫలితంగా భారత రాజ్యాంగంలో కల్పించబడ్డ రాజకీయ రిజర్వేషన్లతో గెలిచిన ఆదివాసి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆదివాసి సంక్షేమం అభివృద్ధి చట్టాల అమలు హక్కులు సాధన కోసం కృషి చేయడం మానేసి నాన్ ట్రైబల్స్ కి ఊడిగం చేస్తూ ఆదివాసి చట్టాలను నాన్ ట్రైబల్స్ కు తాకట్టు పెడుతూ, ఆదివాసి హక్కులను నాన్ డ్రైవర్స్ కు దోచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆదివాసి రిజర్వేషన్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు ఆదివాసీ సమక్షమం కోసం, అభివృద్ధి కోసం, చట్టాలు అమలు కోసం కృషి చేయాలనీ డిమాండ్ చేశారు. ఏజెన్సీ లో ఆదివాసీ చట్టాలు అమలు విషయం లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల పై చర్యలు తీసాడుకోవాలనిప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.కార్యక్రమం లో ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చోడి ప్రదేప్ కుమార్, కోఆర్డినేటర్ పీఠ ప్రసాద్, నాయకులు యలగడ్డ నాగేశ్వరావు, మేక శ్రీను, మూలపర్తి ఈశ్వర్, వెంకన్న, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
