
పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా కోటకొండ 24 తేదీ మార్చి
వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన రూరల్ ఎస్సై రాములు గారు నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు కోసం కోటకొండ ముదిరాజ్ సంఘం వారు 20వేల ఆర్థిక సహాయాన్ని రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సై రాములు గారికి అందించారు. ఈ సందర్భంగా ఎస్సై రాములు గారు కోటకొండ ముదిరాజ్ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో ఇంకా చాలా ప్రముఖులు యువకులు ఉన్నారు వాళ్ళు కూడా వారికి తోచిన సాయం చేస్తే గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తే గ్రామాలు ఎలాంటి సంఘటనలు జరగకుండా గ్రామంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎదురింటి శ్రీను ఎడ్ల రాజు దస్తప్ప కావలి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు