
జనవరి 21, పయనించే సూర్యుడు. బచ్చన్నపేట మండలం జనగామ జిల్లా
కోడూరు పాండరి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోడూరు శివకుమార్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శాసన సభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా, అతని చేతుల మీదుగా గ్రామస్తులకు ఉచిత నీటి క్యాన్ల బహుకరణ అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తనకున్న దాంట్లో నలుగురికి సహాయం చేయడం, వైద్య ఖర్చులకు,విద్యకు, అంత్యక్రియలకు మరియు పేదింటి పెండ్లిలకు సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయమని ఇలాంటి దానగుణం, సాయగుణం ఉన్నటువంటి కోడూరు శివకుమార్ గౌడ్ ను అభినందిస్తున్నానని అన్నారు. రాబోయే లోకల్ ఎలక్షన్లలో టిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా వారు అన్నారు.రైతుబంధు,రైతు రుణమాఫీ,రేషన్ కార్డులు మహిళలకు భరోసా అన్నిటిలో కోతలు పెడుతున్నారని ఇది చేతల ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వం అని పల్లా అన్నారు.కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి,వేముల విద్యాసాగర్,వేముల లక్ష్మణ్,సిద్ధి రాములు,చారి, కృష్ణంరాజు, సిద్ధారెడ్డి మరియు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.