
పొయ్యి కట్టెలు వాడకం గ్యాస్ బండల పేరుతో బిల్లులు
మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండి దురువాసన వచ్చినా పట్టించుకోని వార్డెన్??
రెగ్యులర్ వర్కర్ల స్థానంలో కూలి వర్కర్ల ఏర్పాటు
పయనించే సూర్యుడు ఆగస్టు 30 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి :కోయగూడెం ఆశ్రమ పాఠశాల వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని పి. డి.యస్. యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేత లు మునిగెల శివ ప్రశాంత్, బి.సాయికుమార్ లు డిమాండ్ చేశారు. పిడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థి పోరుబాట యాత్ర బృందం శనివారం కోయగూడెం ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. సందర్భంగా ఆశ్రమ పాఠశాలలోని మరుగుదొడ్లు, వంట పాత్రలు, మంచినీటి ట్యాంకులు, విద్యార్థులు పడుకునే డార్మెంట్లు, డైనింగ్ హాల్, పాఠశాల ఆవరణాన్ని పరిశీలించారు. మరుగుదొడ్లు దుర్వాసన వస్తున్నాయని, మరుగుదొడ్లలో బల్లులు చనిపోయి ఉన్నా శుభ్రం చేయించకుండా అశుభ్రంగా ఉంచ్చారని తెలిపారు. వంటలు చేసేందుకు కట్టెలు ఉపయోగించి గ్యాస్ బండలు వాడినట్లుగా బిల్లులు పెట్టుకుంటున్నారని, కాలిన కట్టెల నుండి వచ్చిన బొగ్గులను అమ్ముకుంటున్నారు అని,రెగ్యులర్ వర్కర్ల స్థానంలో కూలీలను ఏర్పాటు చేసుకొని వర్కర్ల నుండి కూలీల నుండి కమిషన్ లు తీసుకుంటున్నట్లుగా ఆరోపించారు. దీనిపై అధికారుల సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మెనూ పాటించడంలో అవకతవకలు ఉన్నట్లుగా తెలిపారు. పాఠశాలను ఏమాత్రం శుభ్రంగా ఉంచకుండా మరుగుదొడ్లు కనీసం యాసిడితో కడగకుండా అలాగే ఉంచడంతో వచ్చే వాసనతో విద్యార్థులకు తీవ్రంగా ఇబ్బంది అవుతుందని అన్నారు. వంట రూమ్ లో డైనింగ్ హాల్లో శుభ్రత పాటించడం లేదని తెలిపారు. పాఠశాల భవనానికి కరెంట్ సప్లై మీటర్ల వద్ద వర్షం కురిసి షార్ట్ సర్క్యూట్ అవుతుందని తడవకుండా మీటర్ల వద్ద ఏమాత్రం జాగ్రత్త తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఈ క్రమంలో విద్యార్థులు ఎలాంటి ప్రమాదానికైనా గురయ్యే పరిస్థితి ఏర్పడినా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడడమేనని వారు అన్నారు. ఇప్పటికైనా వార్డెన్ నిర్లక్ష్యం పై అధికారులు పరిశీలన చేసి వార్డెన్ నిర్లక్ష్యంపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు విద్యార్థి పోరాట యాత్ర బృందం నాయకులు రామ్ చరణ్,అబ్దుల్ గని,విష్ణువర్ధన్, జార్జ్,శ్రావణి,సంధ్య తదితరులు పాల్గొన్నారు.
