
వసతి గృహాన్ని అపరిశుభ్రంగా ఉంచిన వార్డెన్ పై చర్యలు ఎప్పుడు
గిరిజన శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎల్.ఎఫ్.ఎల్
హెచ్ఎం కు వార్డెన్ గా ఎలా నియమిస్తారు.
వార్డెన్ బాధ్యతల్లో ఉండి విద్యార్థులకు గత కొన్ని రోజులుగా ఉద్దీపం నిర్వహణలో భాగంగా తెలుగు పాఠ్యాంశాలను బోధించని ఉపాధ్యాయుడు.
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి :మండలం కోయగూడెం ఆశ్రమ పాఠశాల వార్డెన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పి డి యస్ యూ బృందం సోమవారం గిరిజన శాఖ నిర్వహించిన ప్రజాదర్భార్ లో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ పిఓ రాహుల్ కు పిడిఎస్యు బృందం వినతిపత్రం ఇచ్చారు.కోయగూడెం ఆశ్రమ పాఠశాలకు పి డి యస్ యూ విద్యార్థి సంఘం నిర్వహించిన పోరుబాటయాత్ర వసతి గృహాన్ని సందర్శించిన విషయం అందరికీ విధితమే. పిడిఎస్యు యాత్ర పరిశీలనలో అనేక సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అధికారులు తూతు మంత్రంగా నోటీసులు ఇస్తామనే పేరుతో చేతులు దులుపుకున్నారు తప్ప ఎలాంటి పరిష్కారం చూపలేదు. మరుగుదొడ్లు శుభ్రంగా లేకుండా ఉండడం, మరుగుదొడ్లలో బల్లులు పడి చనిపోయి ఉన్నా శుభ్రం చేయకపోవడం, విద్యార్థులు స్నానం చేసే వద్ద దుర్వాసన రావడం,వంటలు చేసేందుకు కట్టెలు వాడకం చేసి గ్యాస్ బిల్లులు తీసుకోవడం లాంటివి అనేకం అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గిరిజన శాఖ అసమర్ధ పని విధానానికి నిదర్శనమని పి డి యస్ యూ నాయకులు అన్నారు. అదేవిధంగా గిరిజన శాఖ నిబంధనల ప్రకారం ఎస్జీటీ, క్రాఫ్ట్,పిఈటి లకు మాత్రమే వార్డెన్ల బాధ్యతలు ఇవ్వాలి. ఎక్కడ కూడా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం లకు వార్డెన్ బాధ్యతలు ఇవ్వలేదు.కాని కేవలం కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో గిరిజన శాఖ నిబంధనలను తుంగలో తొక్కి కావాలనే వార్డెన్ గా నియామకం చేసి కంటిన్యూగా ఈ ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ఎం కు మాత్రమే ఎందుకు వార్డెన్ బాధ్యతలు ఇస్తున్నారని అందులో అంతర్యం ఏమిటని పి డి యస్ యూ నాయకులు వారు ప్రశ్నించారు. ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం బాధ్యతల్లో ఉన్న ఈ ఉపాధ్యాయుడికి వార్డెన్ బాధ్యతలు ఇవ్వడం మూలంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా గిరిజన శాఖ తీసుకువచ్చిన ఉద్దీపన నిర్వహణలో భాగంగా తెలుగు పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించకుండా కాలయాపన చేస్తున్నాడని దీనితో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గిరిజన శాఖ నిబంధనల ఉల్లంఘనలపై ఏటీడీవో, డిడి అధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేశారు. పిఓని కలిసిన బృందంలో పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలు మునిగెల శివ, బానోత్ నరేందర్,మోహన్ తదితరులు ఉన్నారు.