
పయనించే సూర్యుడు మార్చి 22 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
శనివారం నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల బెట్టింగ్ లపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఆత్మకూరు సిఐ గంగాధర్ తెలిపారు.జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఐపిఎస్ . ఆత్మకూరు డిఎస్పి వేణుగోపాల్ ఆదేశాలతో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. ఆత్మకురు సర్కిల్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలలో క్రికెట్ బెట్టింగుల వ్యవహారలను పసిగట్టేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిపారు.వారు అన్ని గ్రామాలలో .పలు ప్రాంతాలలో సంచరిస్తూ బెట్టింగ్ వ్యవహారాలను గమనిస్తూ ఉంటారని తెలిపారు.బెట్టింగ్ లకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రత్యేక బృందం తో పాటు తాను తమ ఎస్ఐలు కూడా నిరంతరం కేఫ్, టీ పాయింట్లు హోటల్స్ .లాడ్జిలలో కూడా క్రికెట్ బెట్టింగ్ పాల్పడే వారికోసం పరిశీలిస్తామని తెలిపారు.తమ పిల్లల ప్రవర్తనపై తమ ఆర్థిక లావాదేవీలపై పెద్దలు గమనించుకోవాలని ఆయన తెలిపారు