
మామిడిపల్లిలో ఎంపిల్ – 9 క్రికెట్ టోర్నమెంట్
ముఖ్యఅతిథిగా హాజరై ఎంపిల్ -9 క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావాత్ నరేందర్ నాయక్)
క్రీడల వలన శారీరక దారుఢ్యం పెరుగుతుందని, శారీరక ధారుడ్డం పెరగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, మానసిక ప్రశాంతత వలన క్రీడల్లో నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు అవకాశం లభిస్తుందని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. రంగా రెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లి గ్రామం లోఎంపిల్ -9 క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్సి నవీన్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డిని నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల వలన క్రీడాకారుని లోపల దాగి ఉన్న సహజ నైపుణ్యాలు బయటికి వెలువడుతాయని, అంతర్గత నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని, గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులు ఎదగాలనేదే తన ఉద్దేశం అని, క్రీడాకారులు పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.ఈ కార్యక్రమం లో మామిడిపల్లి మాజీ ఎంపిటిసి కట్న మాదవి రవీందర్,మాజీ సర్పంచ్ కవిత శ్రీనివాస్, ఉపసర్పంచ్ లు సత్యనారాయణ, హన్మంత్ రెడ్డి, సోఫియా షఫీ, వార్డ్ మెంబెర్స్,రఘుపతి రెడ్డి,వెంకటేష్ రెడ్డి,అబ్బాస్,ప్రభు, బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్ రెడ్డి,మొయినోదిన్,ఆశ్రప్, పురుషోత్తం రెడ్డి,వినోద్,అన్వార్ రాంరెడ్డి,ఆంజనేయులు గౌడ్,రాంచెంద్రయ్య,క్రిష్ణ రెడ్డి, రవీందర్ రెడ్డి,మధు,చంద్రశేఖర్ రెడ్డి,రాజు,మనోహర్,ఆర్గనైసర్స్ చిట్టీ,చందు,మజీద్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.