
పయనించే సూర్యుడు// న్యూస్ మే 7//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని సాయి జ్యోతి పాఠశాల గ్రౌండులో నిర్వహిస్తున్న ,వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న 60 మంది బాలబాలికలకు సొంత ఖర్చులతో 18 వేల విలువ చేసే క్రీడా దుస్తులను , అంతర్జాతీయ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్రాంత పిఈటి గోపాలం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇట్టి కార్యక్రమం చేపట్టానని తెలిపారు. కార్యక్రమంలో శిక్షణ శిబిరం నిర్వహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
