
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలం కొత్త తండా గ్రామపంచాయతీ మాలపల్లి గ్రామంలో శుక్రవారం సిలువ మార్గం ఏర్పాటు చేశారు, పెగ్గళ్ళపాడు గ్రామపంచాయతీ నుండి మాలపల్లి వరకు దేవుని పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ క్రైస్తవ భక్తులు సిలువ మోస్తూ వారి భక్తిని చాటుకున్నారు. ఆర్.సి.యం చర్చ్ ఫాదర్ మార్నేని అర్లయ్య, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు యేసు పాపులను రక్షించుట కోసం మరణం పొందాడని తిరిగి మూడో రోజున ఏసుక్రీస్తు సమాధిలో నుంచి లేస్తారని అప్పుడు ఈస్టర్ పండుగ జరుపుకుంటామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముచ్చ సుధాకర్, గుమ్మడి కొమరయ్య, దాసరి గురుస్వామి, కుమ్మరి సామేలు, గొల్ల రాజేష్, మేడికొండ లక్ష్మి, గొల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.