
పయనించే సూర్యుడు మే నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లాలో
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను ప్రభుత్వం విడుదల చేయాలి
జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలి
- పిడిఎస్యు ఆర్ ఎస్ వి విద్యార్థి సంఘాల డిమాండ్* పిడి ఎస్ యు బి ఆర్ ఎస్ వి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు హాల్ టికెట్లు మంజూరు చేయాలని పరీక్ష ఫీజు రుసుమును కట్టించుకునే విధంగా ప్రభుత్వ అధికారులు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి కలిసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల విద్యార్థి ఐక్యత సంఘం పిడిఎస్యు యు జిల్లా అధ్యక్షులు ఎం,నరేందర్ బిఆర్ఎస్వి నాయకులు షాహిద్, పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీ సందర్భంలో గానీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేస్తామని విద్యా వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేస్తామని విద్యార్థులకు ఎలాంటి అవస్థలు లేకుండా కృపరిపాలన ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి ఆనాడు మాట ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆ మాట విస్తరించి విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేశారు . ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను విడుదల చేయక విద్యార్థులు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి అదే విధంగా స్కాలర్షిప్లు రాక ఫీజులు కట్టలేని పరిస్థితిలో అనేక మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారు ప్రైవేట్ యజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందికరంగా పెడుతున్నాయి ఆర్మూర్ లోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రభుత్వం స్కాలర్షిప్లు విడుదల చేయలేక విద్యార్థులు యజమాన్యం పరీక్షలు రాయనివ్వడం లేదు. వారి నుండి ఎగ్జామ్ ఋషులు తీసుకోవడం లేదు ఇది నీ పైన జిల్లా అధికారులు స్పందించాలి ఈ విషయంలో ఇప్పటికే ఆర్మూర్ ఆర్డీవో ని కలవడం జరిగింది అందుకే ఈరోజు మళ్లీ నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ అంకిత్ ని కలిసి విషయంపై మాట్లాడడం జరిగింది కావున అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని వారన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు
