
క్షయ వ్యాధి అంతానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
పయనించే సూర్యుడు మే 23 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో గ్రాన్యూల్ అనే స్వచ్ఛంద సంస్థ వారు అక్షయపాత్ర కార్యక్రమం ద్వారా పంపించిన న్యూట్రిషనల్ కిట్లను స్థానిక వైద్యాధికారి డాక్టర్ కంచర్ల వెంకటేష్ ద్వారా 40 మంది క్షయ వ్యాధి కి మందులు వాడుతున్న రోగులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం అనగా మాంసాహారం,చికెన్ చేపలు గుడ్లు పన్నీరు పాలు మరియు పాల పదార్థాలు చిక్కుడు జాతి ఉత్పత్తులు డ్రై ఫ్రూట్స్ మొదలగునవి అధికంగా తీసుకోవడం వల్ల క్షయ వ్యాధి ద్వారా క్షీణించిన ఊపిరితిత్తుల కణజాలం త్వరగా అభివృద్ధి చెంది వ్యాధిగ్రస్తుడు చాలా త్వరగా కోలుకుంటాడని మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ జిల్లా కావడం వల్ల పేదరికం ఎక్కువ కాబట్టి ఈ సమస్యను గుర్తించిన గ్రాన్యూల్ స్వచ్ఛంద సంస్థ వారు పెద్ద మనసుతో క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషనల్ కిట్లు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని వీరిలాగే సమాజంలోని పారిశ్రామికవేత్తలుధనవంతులు స్వచ్ఛంద సంస్థలు కూడా క్షయ వ్యాధిగ్రస్తులకు తమ వంతు సహాయంగా మంచి పోషకాహారం స్వచ్ఛందంగా అందజేసి క్షయ వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకోవడానికి సహకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్న 2025 సంవత్సరం కల్లా క్షయ వ్యాధి అంతానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇల్లందు డివిజన్ క్షయ యూనిట్ అధికారి శంకర్, సూపర్వైజర్ నాగు బండి వెంకటేశ్వర్లు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు